Thursday, May 8, 2025
HomeTrending Newsఉత్తరఖండ్ లో బిజెపి ప్రభంజనం

ఉత్తరఖండ్ లో బిజెపి ప్రభంజనం

ఉత్తరఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ ముందుకెళ్తున్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రంగా ఆవిర్భవించాక ఏ పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు. గత  సంప్రదాయాలను కాదని బిజెపి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో గత నెల 14న ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుండగా.. బీజేపీ 48  స్థానాల్లో అధికంలో కొనసాగుతున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ 18  స్థానాలు, ఇతరులు నాలుగు  స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఉత్తరఖండ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత హరీశ్‌రావత్‌ లాల్‌ కువాల్‌ స్థానంలో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి మోహన్‌ సింగ్‌ బిస్తీ చేతిలో దాదాపు 14వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అలాగే ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి దాదాపు 6వేలకుపైగా ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి భువన్‌ చంద్ర కప్రీ గెలుపు దిశలో ముందుకెళ్తున్నారు.

ఉత్తరఖండ్ లో మొత్తం శాసనసభ స్థానాలు 70. బిజెపి -47 , కాంగ్రెస్ -19 ,BSP-02 ఇతరులు -02 .

ఇవి కూడా చదవండి: గోవాలో హంగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్