Saturday, November 23, 2024
HomeTrending Newsఉత్తరప్రదేశ్లో నాలుగో దశ ప్రశాంతం

ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ ప్రశాంతం

Uttarpradesh Fourth Phase Elections :

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 8 గంటల వరకు 61.65 శాతం పోలింగ్ నమోదైంది. ఫిలిబిత్ జిల్లలో అత్యధికంగా 67.16 శాతం  పోలింగ్ నమోదైంది. లఖీంపుర్ ఖేరీ జిల్లాలో 62.66 శాతం , సీతాపుర్ జిల్లాలో 57.73 శాతం , హర్దోయ్ జిల్లాలో58.99 , ఉన్నావ్ జిల్లాలో57.01 , లక్నో నగర పరిధిలో 60.31, రాయ్ బరేలీ జిల్లాలో59.56 , బాందా జిల్లాల్లో60.12 , ఫతేపుర్ జిల్లా పరిధిలో61.03 శాతం నమోదైంది.

నేడు  ఫిలిబిత్, లఖీంపుర్ ఖేరీ, సీతాపుర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బాందా, ఫతేపుర్ జిల్లాల‌ పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్ జరిగింది. మొత్తం 624 మంది అభ్యర్థులు ఈ పోటీలో నిలిచారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లక్నోలోని మున్సిపల్ నర్సరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ లక్నోలో ఓటు వేయగా రైతుల మృతి ఘటనలో విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్ర తేని లఖిం పూర్ ఖేరి లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నేడు ఎన్నికలు జరిగిన 59 స్థానాల్లో  2017లో బీజేపీ 51, ఎస్పీ 4, బీఎస్పీ 3, అప్నాదళ్‌ ఒకచోట గెలుపొందాయి. ఈ ఎన్నిక‌ల బ‌రిలో యూపీ మంత్రులు బ్రిజేశ్ పాఠక్, అశుతోశ్ టాండన్ తో పాటు యూపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నితిన్ అగర్వాల్, ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్ సింగ్ ఉన్నారు. దశలవారీగా పోలింగ్ ముగుస్తోన్నకొద్దీ- తరువాతి విడతలపై అన్ని రాజకీయ పార్టీలు కూడా దృష్టి సారించాయి. ఇప్పటిదాకా ముగిసిన విడతల్లో తమకు ఎన్ని అసెంబ్లీ స్థానాలు లభిస్తాయోనంటూ లెక్కలు బేరీజు వేసుకుంటున్నాయి. మిగిలిన దశల్లో నిర్వహించే పోలింగ్‌పైనా అదే ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నాయి. దీనికి అనుగుణంగా తమ ఎన్నికల ప్రచార పర్వాన్ని రూపొందించుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్