Thursday, September 19, 2024
Homeసినిమా ఆదిపురుష్ యువి క్రియేష‌న్స్ కి లాభాలు అందిస్తుందా..?

 ఆదిపురుష్ యువి క్రియేష‌న్స్ కి లాభాలు అందిస్తుందా..?

యువి క్రియేష‌న్స్ ప్రభాస్ సొంత బ్యాన‌ర్,  ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సంస్థ ఎక్కువగా ప్ర‌భాస్ తోనే  సినిమాలు నిర్మించింది.  బైటి హీరోల‌తో పాటు భారీ, మీడియం బ‌డ్జెట్ మూవీస్ కూడా నిర్మిస్తోంది. ఆమధ్య ‘బాహుబలి’ పంపిణీ చేసిన యూవి క్రియేషన్స్ ఇప్పుడు ‘ఆదిపురుష్’  తెలుగు రాష్ట్రాల డబ్బింగ్ హక్కులను షుమారు 100 కోట్లకు కొనుగోలు చేసింద‌ని చేసినట్లు సమాచారం.

ఇటీవల యూవీ నిర్మించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డ్డాయి. దీనితో భారీగా న‌ష్టం వ‌చ్చింది. ఈ రెండు సినిమాల త‌ర్వాత భారీ అటుంచి ఓ మీడియం సినిమా చేయ‌డానికి కూడా ఆలోచ‌న‌లో ప‌డింది. ఇలాంటి టైమ్ లో ఆదిపురుష్ మూవీని ఏకంగా వంద కోట్ల రూపాయలతో తెలుగు రాష్ట్రాల హక్కులను దక్కించుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇది ఒక విధంగా రిస్కే. అయితే.. ఆదిపురుష్ ఘన విజయం సాదిస్తుందని, భారీ లాభాలు వస్తాయని నమ్మకంతో ఉన్నారట. రామాయణం ఇతివృత్తంతో రూపొందిన ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ కనిపించబోతుంది. మ‌రి.. ఈ సినిమా అయినా యువి క్రియేష‌న్స్ కి లాభాలు అందిస్తుందేమో చూడాలి.

Also Read : ‘ఆదిపురుష్’ని టెన్ష‌న్ పెడుతున్న ‘బ్ర‌హ్మ‌స్త్ర‌’

RELATED ARTICLES

Most Popular

న్యూస్