ఎన్టీఆర్, నాగ్ లు బాలీవుడ్ ని ర‌క్షిస్తారా?

బాలీవుడ్.. ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగింది. ఎప్పుడైతే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ‘బాహుబ‌లి’తో సంచ‌ల‌నం సృష్టించారో.. అప్ప‌టి నుంచి బాలీవుడ్ పోక‌స్ మొత్తం మ‌న తెలుగు సినిమా వైపు షిష్ట్ అయ్యింది. బాలీవుడ్ మేక‌ర్స్ మాత్ర‌మే కాదు.. బాలీవుడ్ ఆడియ‌న్స్ కూడా తెలుగు నుంచి సినిమా వ‌స్తుంది అంటే.. హీరో ఎవ‌రు అనేది చూడ‌కుండా సినిమాని ఆద‌రిస్తున్నారు. దీనికి తోడు బాలీవుడ్ బ‌డా ఫిల్మ్స్ వ‌రుస‌గా ఫ్లాప్ అవ్వ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో బాలీవుడ్ ఉంది.

ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ‘బ్రహ్మ‌స్త్రం‘ సినిమాను నిర్మించింది. అయాన్ ముఖ‌ర్జీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాలీవుడ్ క్యూట్ క‌పుల్ ర‌ణ్ భీర్, ఆలియా భ‌ట్ జంట‌గా న‌టించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లు పోషించారు. అయితే.. సౌత్ లో ఈ సినిమాకి క్రేజ్ తీసుకువ‌చ్చేందుకు నాగ్ తో కీల‌క పాత్ర చేయించారు.

ఇక ప్ర‌మోష‌న్స్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపారు. ఈ విధంగా నాగ్, ఎన్టీఆర్ క్రేజ్ తో బ్ర‌హ్మ‌స్త్రం సినిమాను స‌క్సెస్ చేయాల‌ని బాలీవుడ్ బ‌డా ఫిల్మ్ మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ ప్లాన్. ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌నున్నారు. ఇటీవ‌ల అడ్వాన్స్ బుకింగ్ ఒపెన్ చేశారు. దీనికి రెస్పాన్స్ బాగానే ఉండ‌డంతో బాలీవుడ్ కు కాస్త ఊర‌ట ల‌భించింది. అయితే.. ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేస్తుంది..?  టాక్ ఎలా ఉంటుంది..?   నాగ్, ఎన్టీఆర్ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు హెల్ప్ అవుతుంది..? అనేది చూడాలి.

Also Read : బ్ర‌హ్మ‌స్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ వెనుక ఏం జ‌రిగింది? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *