Wednesday, March 18, 2026
Homeసినిమానవీన్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన యు.వి.క్రియేషన్స్

నవీన్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన యు.వి.క్రియేషన్స్

UV Creations with Naveen: వరస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి.  ఈ యంగ్ హీరోతో యువీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రం షూటింగ్ లో డిసెంబర్ నెలాఖరు నుంచి జాయిన్ కానున్నారు నవీన్. డిసెంబర్ 26న నవీన్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో మరో ప్రధాన పాత్రలో అనుష్క శెట్టి నటిస్తున్నారు. అనుష్క శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య ఈ సినిమా అనౌన్స్‌ మెంట్ వచ్చింది.

సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్‌కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. నవీన్ పొలిశెట్టికి హీరోగా మూడో సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా.

దర్శకుడు మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ  సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular