Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

నూతన యువకథా నాయకులు  శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్స్ గా అనిల్ ఇనమడుగు స్వీయ దర్శకత్వంలో యల్ యస్ ప్రొడక్షన్స్ సమర్పణలో అఖి క్రియేటివ్స్ వర్క్స్ బ్యానర్ పై  అభిరుచిగల నిర్మాత యం. శ్రీనివాసులు నిర్మించిన ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘తీరం’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని అక్టోబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు, మరో హీరో శ్రావణ్ వైజిటి, కెమెరామెన్ శ్రావణ్ జి.కుమార్, నటుడు అజాస్, సినేటెరియా గ్రూప్ సిఇఓ వెంకట్ బొలేమోని, నిర్మాత యం. శ్రీనివాసులు పాల్గొన్నారు.

హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ “కొత్తవాళ్ళం అని చూడకుండా  అడిగిన వెంటనే మంచి మనసుతో మా తీరం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన గొప్ప దర్శకులు వినాయక్ గారికి మా కృతజ్ఞతలు. ఇక సినిమాని ప్రెజెంట్ యూత్ కి తగ్గట్లుగా ట్రెండీగా తీయటం జరిగింది. యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా తీరం చిత్రాన్ని తెరకెక్కించాం. సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఉంటూనే అంతర్లీనంగా ఒక చక్కని సందేశం ఈ చిత్రంలో చూపించటం జరిగింది. ఖచ్చితంగా ప్రేక్షకులకు తీరం సినిమా నచ్చుతుంది మా టీమ్ అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా సినిమా చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాం” అన్నారు.

మరో హీరో శ్రావణ్ వైజిటి మాట్లాడుతూ “తీరం సినిమా చాలా బాగా వచ్చింది.. అందరం చాలా నమ్మకంతో ఉన్నాం.. ఈ చిత్రాన్ని అనిల్ సుపెర్బ్ గా చిత్రీకరించారు.. సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి.. శ్రవణ్ కెమెరా విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి.. వినాయక్ గారి లాంటి పెద్ద దర్శకులు మా చిన్న సినిమా ట్రైలర్ లాంఛ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. మా టీమ్ అందరి తరుపున ఆయనకి మా ధన్యవాదాలు.. ఈ తీరం చిత్రాన్ని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని ప్రేక్షకులను అభ్యర్ధిస్తున్నాను” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com