హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఖాళీగా ఉన్న 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవలే 46 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా మరో 132 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను డిపార్ట్మెంట్ సెలెక్షన్ కమిటీ ద్వారా నేరుగా భర్తీ చేయనున్నారు. నిమ్స్ చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో డాక్టర్లను భర్తీ చేయటం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటంపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో పాటు దవాఖాన వైద్య సిబ్బంది. హర్షం వ్యక్తంచేశారు. కార్పొరేట్ దవా ఖానలను తలదన్నేలా వైద్యసేవలు అందిస్తున్న నిమ్స్ పెద్ద సంఖ్యలో వైద్యులను నియమించడం వల్ల మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని బీరప్ప తెలిపారు. కొత్త వైద్యులు వస్తే ప్రస్తుతం ఉన్న వైద్యులపై పని ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *