Saturday, January 18, 2025
HomeTrending Newsమధ్యప్రదేశ్ లో వ్యాక్సినేషన్ మహాభియాన్

మధ్యప్రదేశ్ లో వ్యాక్సినేషన్ మహాభియాన్

కరోన మహమ్మారిని కట్టడి చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం చేపట్టింది. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సోమవారం ‘’వ్యాక్సినేషన్ మహాభియన్ ‘’ ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ లో ప్రకటించారు. మహాభియాన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కేంద్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.

వ్యాక్సినేషన్ మహాభియాన్ ద్వారా ఒకే రోజు పది లక్షల మందికి టీకాలు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో టీకా కోసం అన్ని వర్గాల వారు రావచ్చని, ఈ సదుపాయం రాష్ట్ర ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. థర్డ్ వేవ్ వార్తల నేపథ్యంలో మహాభియాన్ తోడ్పడుతుందని సిఎం  చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు ఉత్తరఖండ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో థర్డ్ వేవ్ మొదలయిందని వార్తలు వస్తున్నాయి. ఉత్తర కాశి, రుద్ర ప్రయాగ్ తదితర ప్రాంతాల్లో చిన్నారులను కరోన ఇబ్బంది పెడుతోందని సమాచారం! వందల్లో చిన్నారులకు జ్వరం వస్తోందని అయితే ప్రాణపాయం అంతగా లేదని తెలిసింది. అయితే ఈ వార్తల్ని కేంద్ర ఆరోగ్య శాఖ, ఉత్తరఖండ్ ప్రభుత్వం దృవీకరించలేదు. వర్షాకాలం కారణంగా వస్తున్న వైరల్ ఫీవర్ కావొచ్చని చెపుతున్న వైద్య వర్గాలు థర్డ్ వేవ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్