Vaddura Sodara Movie Motion Poster Attracting The Youth Audience :

కన్నడ యంగ్ స్టార్ రిషి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న సినిమా “వద్దురా సోదరా”. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ నాయికగా నటిస్తోంది. ఓ వినూత్న ప్రేమకథతో దర్శకుడు ఇస్లాహుద్దీన్ “వద్దురా సోదరా” చిత్రాన్ని రూపొందించారు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి తీసుకొస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ నిర్మాతలు.

సోమవారం ఉదయం 8 గంటలకు “వద్దురా సోదరా” సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మోషన్ పోస్టర్ చూస్తే.. ప్రేయసికి దూరమైన ఓ ప్రేమికుడు తన బాధను వ్యక్తం చేస్తూ వాయిస్ ప్రారంభమైంది. నా ప్రేయసి తనకు ఇష్టంలేని వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు నేను లేకుండా తను ఎప్పుడూ సంతోషంగా ఉండలేనని చెప్పింది. అప్పటి నుంచి నేను కూడా సంతోషంగా ఉండటం మానేశాను. కానీ ఇప్పుడు ఒక సంతోషపు ముసుగు వేసుకుని బ్రతుకుతున్నాను. పైకి సంతోషంగా లోపల బాధతో మిగిలిపోయాను. అని చెబుతూ ముగించారు. కథానాయకుడు రిషి ఒక కుర్చీకి బంధించుకోవడం వెనక సింబాలిక్ రీజన్ ఏంటో సినిమాలో చూడాలి.

నాగభూషణ, గ్రీష్మ శ్రీధర్, మహదేవ్ ప్రసాద్, భవానీ ప్రకాష్, అపూర్వ ఎస్ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – విష్ణు ప్రసాద్ పి, దిలీప్ కుమార్ ఎంఎస్, ఎడిటింగ్ – గురుస్వామి టి, సంగీతం – ప్రసన్న శివరామన్, బ్యానర్స్ – స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్, నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ, రచన, దర్శకత్వం – ఇస్లాహుద్దీన్.

Must Read : సుమన్ కెరీర్ మలుపుతిప్పిన సినిమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *