Saturday, March 14, 2026
Homeసినిమాఇటు శ్రీలీల .. అటు వైష్ణవ్ తేజ్!

ఇటు శ్రీలీల .. అటు వైష్ణవ్ తేజ్!

మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్, తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. దాంతో ఇక వరుస సక్సెస్ లతో కుర్రాడు చెలరేగిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆయన చేసిన సినిమాలేవీ ఆశించిన స్థాయి విజయాలను సాధించలేదు. ‘కొండపొలం’ సినిమా వసూళ్ల పరంగా బాగా వెనుకబడింది. ‘రంగ రంగ వైభవంగా’ సినిమా రొటీన్ కంటెంట్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ చేసిన సినిమానే ‘ఆదికేశవ‘.

ఈ సినిమా ట్రైలర్ చూస్తే యాక్షన్ ఒక రేంజ్ లో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. అప్పుడే మాస్ యాక్షన్ ఇమేజ్ కోసం కుర్రాడు తొందరపడుతున్నాడా అనే టాక్ కూడా వచ్చింది. నిజానికి ఈ సినిమా విడుదలకి సిద్ధమై చాలా కాలమైంది. సరైన సమయం చూసుకుని ఈ రోజున థియేటర్లకు తీసుకొచ్చారు. నాగవంశీ – సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాలో, కథానాయికగా శ్రీలీల కనిపిస్తుంది.

ఈ రోజున ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేశారు. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ ను బట్టి చూస్తే, వైష్ణవ్ తేజ్ ఒక రేంజ్ లో ఫైట్స్ చేస్తే, శ్రీలీల డాన్సులతో హోరెత్తించింది. ఆమె డాన్సులకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాంతో ఈ సినిమాను సక్సెస్ దిశగా నడిపించడానికి వైష్ణవ్ తేజ్ ఫైట్లు ప్రధానమైన పాత్రను పోషిస్తాయా? లేదంటే శ్రీలీల డాన్సులు ప్రధాన కారణమవుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరి వాటా ఎంతైనా ఈ సినిమా హిట్ శ్రీలీల కంటే వైష్ణవ్ కి ఎక్కువ అవసరం అని మాత్రం చెప్పచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular