Monday, June 15, 2026
HomeసినిమాVakeel Saab 2: 'వకీల్ సాబ్ 2' కథ రెడీ అవుతుందా..?

Vakeel Saab 2: ‘వకీల్ సాబ్ 2’ కథ రెడీ అవుతుందా..?

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యింది. కరోనా టైమ్ లో రిలీజ్ అయినప్పటికీ దిల్ రాజుకు మంచి లాభాలు అందించింది. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తారనుకుంటే… వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నారు.

అయితే… వకీల్ సాబ్ రిలీజైంది కానీ.. వేణు ఇప్పటి వరకు నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. వకీల్ సాబ్ టైమ్ లో వేణు.. వకీల్ సాబ్ సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తానని ప్రకటించారు. అప్పుడు ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు వకీల్ సాబ్ రిలీజై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేణు స్పందించారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్పారు. వకీల్ సాబ్ సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తున్నాను. తప్పకుండా ‘వకీల్ సాబ్ 2’ ఉంటుంది. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తాను అని తెలియచేశారు.

కరోనా వల్ల థియేటర్లు మూసేసే సమయానికే వకీల్ సాబ్ 90 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మరో వారం రోజులు థియేటర్లు ఉన్న వంద కోట్ల క్లబ్ లో చేరుండేదని అంతా అనుకున్నారు. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. అయితే.. ఇప్పుడు వకీల్ సాబ్ 2 వార్తల పై డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడంతో అందరి కన్నూ ఈ చిత్రం పై పడింది. ఈసారి వకీల్ సాబ్ 2 మరిన్నిరికార్డులు సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. మరి.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో..? ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular