Sunday, January 19, 2025
HomeTrending Newsబిసి కమిషన్ ఛైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణ

బిసి కమిషన్ ఛైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణ

నూతనంగా నియమితులైన బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కిషోర్ గౌడ్, సంపత్, శుభప్రదపటేల్ ఈరోజు బుదవారం ఖైరతాబాద్లోని బిసి కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్తో పాటు బిసి సంక్షేమ శాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఛైర్మన్ వినోద్ కుమార్, విద్యుత్ సంస్థల సీఎండి ప్రభాకర్ రావులు హాజరయ్యారు.

ఉదయం పదిన్నర గంటలకు తన ఛాంబర్లో పదవీ భాద్యతల స్వీకరించిన వకుళాభరణం క్రుష్ణమోహన్ రావుతో పాటు సభ్యులుగా పదవీ భాద్యతలు స్వీకరించిన కే.కిశోర్ గౌడ్, సంపత్, శుభప్రద్ పటేల్ లకు మంత్రితో పాటు పెద్దలు శుభాబినందనలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు బిసి కమిషన్ దిగ్విజయంగా పనిచేయాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బిసిల, ఎంబిసీల, సంచార కులాల అంశాలపై, ఆ వర్గాల సమగ్ర వికాసం, అభ్యున్నతికి చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి నిర్ధిష్టమైన సూచనలను ఇవ్వడంలో కమిషన్ గురుతరమైన భాద్యతను నిర్వర్తించాలని సూచించారు. బిసి సంక్షేమ శాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం కమిషన్ ఛైర్మన్, సభ్యుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ అధికారులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిసిల ప్రతినిధులు, కమిషన్ సభ్యుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్