Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న హారర్ థ్రిల్లర్ 'వళరి' 

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న హారర్ థ్రిల్లర్ ‘వళరి’ 

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై హారర్ థ్రిల్లర్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. హారర్ కి కాస్త కామెడీ కూడా తోడైతే, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ తరహా సినిమాల పట్ల ఆసక్తిని చూపుతుంటారు. ఇక పిల్లలు భయపడుతూనే చూడటానికి కుతూహలాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలను చూడటానికి ఒక వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అలాంటి ఒక హారర్ కథాంశంతో ఓటీటీ సెంటర్ కి వచ్చేస్తున్న సినిమానే ‘వళరి’.

‘వళరి’ అనేది తమిళ ప్రాంతంలో ప్రాచీన కాలంలో ఉపయోగించిన ఒక ఆయుధం పేరు. అప్పట్లో బ్రిటీష్ వారిని భయపెట్టిన ఆయుధం ఇది. అందువలన బ్రిటీష్ ప్రభుత్వం అప్పట్లో ఈ ఆయుధాన్ని ఉపయోగించడాన్ని నిషేధించింది. ఆ ఆయుధాన్ని సూచిస్తూనే ఈ సినిమా టైటిల్ ను డిజైన్ చేసిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను రితికా సింగ్ పోషించింది. రీసెంట్ గా ఆమె పోస్టర్ ను వదిలారు. దీనంగా పడుకుని ఏదో ఆలోచన చేస్తున్న ఆమె వెనుక, ఒక దెయ్యం ఉండటం ఈ పోస్టర్లో కనిపిస్తోంది.

దెయ్యం నేపథ్యంలోని ఈ కథకు .. ‘వళరి’ అనే ఆయుధానికి సంబంధం ఏమిటనేది సస్పెన్స్. ‘రోజాపూలు’ శ్రీరామ్ ఈ సినిమాలో కథానాయకుడిగా కనిపించనున్నాడు. నేవీ ఆఫీసర్ కెప్టెన్ నవీన్  నాయుడు పాత్రను ఆయన ఈ సినిమాలో పోషించాడు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘ఈటీవీ విన్’ దక్కించుకుంది. మార్చి 6వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. పోస్టర్స్ నుంచే ఆసక్తిని పెంచుతూ వచ్చిన ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్