Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Varasudu:  ద‌ళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి ‘వారసుడు‘ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న చిత్రం కావడంతో ‘వారసుడు’ అనే యాప్ట్ టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు విజయ్. ఫస్ట్ లుక్ లో స్టయిలీష్ గా కనిపిస్తూనే సీరియస్ లుక్ ఇవ్వడం ఆసక్తిని పెంచింది.” ది బాస్ రిటర్న్స్” అనే ట్యాగ్ లైన్ మరింత ఇంట్రస్టింగ్ గా వుంది. భారీ అంచనాలు వున్న ఈ కాంబినేషన్ పై టైటిల్, పోస్టర్ ఆ అంచనాలని మరింత భారీగా పెంచాయి. అన్ని వర్గాల ప్రేక్షలని ఆకట్టుకునే చిత్రాలను రూపొందించే ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం యూనివర్సల్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి తమిళంలో ‘వారిసు’ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్‌ను తయారు చేసిన దర్శకుడు వంశీపైడిపల్లి విజయ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయనున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్ పై కీలకమైన భారీ షెడ్యూల్‌ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com