Sunday, November 24, 2024
HomeTrending Newsపశ్చిమ బెంగాల్లో వందేభారత్ రైలు ప్రారంభం

పశ్చిమ బెంగాల్లో వందేభారత్ రైలు ప్రారంభం

హౌరా – న్యూ జల్పాయిగురి మధ్య వందేభారత్ రైలు ఈ రోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి వర్చ్యువల్ విధానంలో గుజరాత్ నుంచి జెండా ఉపి ప్రారంభించారు. వారానికి ఆరు రోజులు రెండు నగరాల మధ్య ఈ రైలు నడుస్తుంది. కలకత్తా-సిలిగురి మధ్య 550 కిలోమీటర్ల దూరం ఈ రైలు ద్వారా కేవలం ఏడున్నర గంటల్లో చేరుకునే సౌలభ్యం ఏర్పడింది. ఇప్పటివరకు కలకత్తా నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేవారు సుమారు 12 గంటలు ప్రయాణిస్తే కానీ సిలిగురి చేరుకోలేని పరిస్థితి ఉండేది. వందే భారత్ రైలుతో బెంగాల్ ముఖ్య నగరాలైన కలకత్తా-సిలిగురి మధ్య ప్రయాణించే వారికి ఉరటగా చెప్పుకోవచ్చు.

వందేభారత్ రైలు ప్రతి రోజు ఉదయం 5.50కి హౌరా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 01.25కి న్యూ జల్పాయిగురి చేరుకుంటుంది. తిరిగి న్యూ జల్పాయిగురి నుంచి మధ్యాహ్నం 03.05 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 10.35 నిమిషాలకు హౌరా చేరుకుంటుంది.  బుధవారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈ రైలుకు కేవలం మూడు స్టేషన్ లలో మాత్రమె హాల్ట్ ఇచ్చారు. బోల్పూర్, మాల్దా, బర్సోయి నగరాల్లో మాత్రమె వందేభారత్ రైలు ఆగుతుంది. ఉత్తర బెంగాల్ – దక్షిణ బెంగాల్ ప్రాంతాల మధ్య వందేభారత్ రైలు దూర భారాన్ని తగ్గిస్తుంది.

హౌరా రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద బోస్ తదితరులు పాల్గొన్నారు. తల్లి హేరాబెన్ అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడి గుజరాత్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మాతృమూర్తి మృతిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్