Tuesday, March 10, 2026
HomeTrending Newsవందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గాంధీ నగర్, ముంబయి సెంట్రల్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఈ రోజు ప్రారంభించారు. గాంధీనగర్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైలును అధికారికంగా ప్రారంభించారు.  అనంతరం వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో అహ్మదాబాద్ వరకు ప్రయాణించారు. ఆయనతో పాటు సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. ఈ రైలు గాంధీ నగర్ నుండి మహారాష్ట్ర రాజధాని ముంబైకి ప్రయాణించనుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు నడవనుంది.

మొదట గాంధీ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని మొదట వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను పరిశీలించారు. రైల్వే సిబ్బందిని అడిగి రైలుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడమే కాదు స్వయంగా ఇంజన్ భాగాన్ని పరిశీలించారు. అనంతరం రైలును ప్రారంభించి అందులోనే కాలుపుర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా రైల్లో మహిళలు, చిన్నారులతో పాటు సిబ్బందితో ముచ్చటించారు.

ప్రధాని ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ దేశంలో మూడోవది. 16 కోచ్ లు ఉన్న ఈ ట్రైన్ లో 1128 మంది ప్రయాణించే అవకాశముంది. మిగిలిన రెండు రైళ్లతో పోలిస్తే ఈ ట్రైన్ లో సౌకర్యాలను మరింత మెరుగుపరిచారు. రిక్లైనింగ్ సీట్లు, ఆటోమేటిక్ ఫైర్ సెన్సార్లు, సీసీటీవీ కెమెరాలు, వైఫై తదితర సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు.

Also Read : భారత్ బంగ్లా మధ్య మూడో రైలు ప్రారంభం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular