Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్ స‌ర‌స‌న సైఫ్ వైఫ్‌! వ‌ద్దంటున్న ఫ్యాన్స్?

ప్ర‌భాస్ స‌ర‌స‌న సైఫ్ వైఫ్‌! వ‌ద్దంటున్న ఫ్యాన్స్?

No Kareena: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. సంక్రాంతికి ఆదిపురుష్ వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ప్ర‌స్తుతం స‌లార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీతో పాటు పాన్ వ‌ర‌ల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది. అమితాబ్ కూడా ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌భాస్ స‌ర‌స‌న సైఫ్ ఆలీఖాన్ వైఫ్ క‌రీనా క‌పూర్ న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏ సినిమాలో అంటే.. అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ‌తో ప్ర‌భాస్ చేయ‌నున్న స్పిరిట్ మూవీలో అని టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ మూవీ కోసం క‌రీనా క‌పూర్ ని సంప్ర‌దించార‌ని ఆమె త్వ‌ర‌లో త‌న నిర్ణ‌యం చెబుతాన‌ని చెప్పింద‌ట‌. ఆమె క‌నుక ఈ సినిమాలో న‌టించేందుకు ఓకే చెబితే తెలుగులో ఇదే క‌రీనా ఫ‌స్ట్ మూవీ అవుతుంది.

ఈ వార్త‌లో నిజ‌మెంతో తెలియ‌దు కానీ.. సందీప్ సెల‌క్ష‌న్ బాగా లేదని,  ప్ర‌భాస్  ప‌క్క‌న క‌రీనా న‌టిస్తే.. అక్క‌లా ఉంటుంద‌ని అభిమానులు  అంటున్నారు.  ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకోవాలని కోరుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఈ మూవీపై…. ఖ్యంగా క‌రీనా క‌పూర్ గురించి చ‌ర్చ జ‌రుగుతుంది.  మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ స్పందిస్తారేమో చూడాలి.

Also Read : ‘ఆదిపురుష్’ని టెన్ష‌న్ పెడుతున్న ‘బ్ర‌హ్మ‌స్త్ర‌’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్