Thursday, March 19, 2026
Homeసినిమా'వారసుడు' సంక్రాంతికి రిలీజ్

‘వారసుడు’ సంక్రాంతికి రిలీజ్

దళపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు’/ వారిసు చిత్రం చివరి షెడ్యూల్ మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల నుంచి సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. దీపావళి సందర్భంగా 2023 సంక్రాంతికి వారసుడు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో మేకర్స్ పండుగ సీజన్‌ ను సద్వినియోగం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు.

విజయ్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, ఒక పెద్ద సుత్తిని పట్టుకొని కనిపించారు. యాక్షన్-బ్లాక్ ని సూచిస్తున్న ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.క్లాసియెస్ట్ బెస్ట్ లుక్‌ లో విజయ్‌ని ప్రజంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, సెకండ్ లుక్ పోస్టర్ ‌లకు భారీ స్పందన వచ్చింది. టైటిల్, పోస్టర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.

భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

Also Read సంక్రాంతి పోటీలో విజేత‌గా నిలిచేదెవ‌రు..? 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular