Thursday, March 19, 2026
Homeసినిమావిజ‌య్ మూవీకి నాగ్ టైటిల్?

విజ‌య్ మూవీకి నాగ్ టైటిల్?

Old Title: కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్, టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజ‌య్ 66వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. తెలుగు, త‌మిళ్ లో రూపొందిస్తున్న ఈ చిత్రం పై అటు త‌మిళ్, ఇటు తెలుగులో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

అయితే… ఈ మూవీకి టైటిల్ ఏంటి అనేది ప్ర‌క‌టించ‌లేదు కానీ.. ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే విజయ్ సినిమా కోసం చిత్ర బృందం వారసుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఇది తెలుగు వెర్షన్ కు మాత్రమే టైటిల్ గా ఉండబోతుందట. తమిళ్ లో వేరొక టైటిల్ ను లాక్ చేయబోతున్నారని స‌మాచారం. గతంలో తెలుగులో వారసుడు అనే టైటిల్ తో అక్కినేని నాగార్జున సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడుఈ టైటిల్ ను వంశీ పైడిపల్లి.. విజయ్ చిత్రానికి ఫిక్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లో నిజ‌మేంత అన‌ది తెలియాల్సివుంది.

Also Read : సంక్రాంతి బ‌రిలో దళపతి విజయ్-వంశీ పైడిపల్లి మూవీ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular