Saturday, January 18, 2025
HomeTrending NewsCanada: హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ఆఫర్

Canada: హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ఆఫర్

పశ్చిమ దేశాల్లో మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించేందుకు వివిధ దేశాలు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. అమెరికాలో వ్రుత్తి నైపుణ్యం కలిగిన ఉద్యోగం  చేసే వారికి కెనడా గాలం వేసింది. హెచ్‌-1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ దేశంలోనూ మూడేండ్లు ఉద్యోగం చేసుకోవచ్చని కెనడా ప్రకటించింది.

దీంతోపాటు వీసాదారుల కుటుంబ సభ్యులు ఉద్యోగం, విద్యాభ్యాసం చేసుకొనే అవకాశం కూడా కల్పించింది. ఈ నెల 16 నుంచి ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని కెనడా ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఆఫర్‌కు భారీ స్పందన లభించడంతో రెండు రోజులకే ఐఆర్‌సీసీ పోర్టల్‌లో దరఖాస్తుల స్వీకరణను నిలిపేశారు. అదనపు దరఖాస్తులను స్వీకరించమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్