Sunday, June 14, 2026
Homeసినిమాపాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’లో వరుణ్ సందేశ్

పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’లో వరుణ్ సందేశ్

varun in Michel: టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న భారీ యాక్షన్ మైఖేల్. సందీప్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే పాత్ర‌ను పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. టాలెంట్ స్టార్ వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌ లో భాగం కావ‌డం విశేషం.

ఇప్పుడు, ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం వరుణ్ సందేశ్‌ను చిత్ర బృందం స్వాగతించింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ నుండి నిష్క్రమించిన తర్వాత వరుణ్ సందేశ్ అంగీక‌రించిన  మొదటి పెద్ద ప్రాజెక్ట్ ఇది. మైఖేల్ చిత్రం షూటింగ్ తాజా షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తుండగా, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మైఖేల్ చిత్రం భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular