Friday, March 29, 2024
Homeసినిమావరుణ్ తేజ్ అతిథిగా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ప్రీ-రిలీజ్

వరుణ్ తేజ్ అతిథిగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ప్రీ-రిలీజ్

Varun Tej Attended As Chief Guest For Ocfs Pre Release Event :

సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా సీనియర్ నరేష్, తులసి, ‘గెటప్’ శీను, ప్రమీల రాణి (భామ) ప్ర‌ధాన‌ పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ‘ (OCFS). పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకం పై మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఆయనతో కలిసి మానసా శర్మ కథ, మాటలు అందించారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్ గల ఈ వెబ్ సిరీస్ నవంబర్ 19న ‘జీ 5’ ఓటీటీ వేదికలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వరుణ్ తేజ్, వెబ్ సిరీస్ లో ‘అరే మహేషా…’ పాటను విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ… “బహుశా ఏడాది క్రితం వెబ్ సిరీస్ చేస్తున్నట్టు నిహారిక చెప్పింది. స్టోరీ, టైటిల్ ఏమీ చెప్పలేదు. తనకెప్పుడూ ‘ఇది చెయ్, అది చెయ్’ అని చెప్పలేదు. ప్రయోగాలు చేస్తూ తన దారి వెతుక్కోవాలని అనుకుంటుంది. నిహారిక వర్క్ లో మేం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వం. చూసి బావుందో, లేదో చెబుతాం. ఇటీవల ట్రైలర్ చూపించినప్పుడు నిజంగా నేను షాకయ్యా. ట్రైలర్ బావుంది. నాకు సంతోష్ శోభన్ తెలుసు కానీ, తనకు బ్రదర్ ఉన్నాడని తెలియదు.

ట్రైలర్ చూశాక… ‘ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగా చేస్తున్నాడు. ఇంతకు ముందు ఎన్ని సినిమాలు చేశాడు?’ అని అడిగా. తన టైమింగ్, యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. నేను ఈ వెబ్ సిరీస్ చూడాలని అనుకోవడానికి గల కారణాల్లో అతడూ ఒకడు. సంతోష్, సంగీత్ ను చూసి వాళ్ల నాన్నగారు గర్వపడతారు. నరేష్ గారి లాంటి ఆర్టిస్ట్ సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులు చేయడం కొత్తవాళ్లకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అందరూ సినిమా క్వాలిటీలో ఉందని చెబుతున్నారు. పోను పోనూ సినిమాకు, ఓటీటీకి డిఫరెన్స్ ఉండదు.

మనం చూసే మీడియమ్ డిఫరెంట్ అవ్వొచ్చు. సినిమా అంటే థియేటర్లు, ఓటీటీ అంటే ఇంట్లో చూడవచ్చు. అందరం కంటెంట్ ను నమ్ముకుని వచ్చినవాళ్లం. సినిమా వల్ల చాలా మందికి ఒక ఫ్లాట్‌ఫామ్ ఉంటుంది. బయట ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అయితే.. సినిమా వల్ల వాళ్లందరికీ ఒక లెవల్ వరకూ అవకాశాలు వస్తాయి. ఓటీటీ వల్ల చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. ఇటువంటి ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేసిన ‘జీ 5’ వాళ్లకు థాంక్స్. ఈ నెల 19న ‘జీ 5’ ఓటీటీలో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ ఇంట్లో ఫ్యామిలీస్ తో కూర్చుని ఈ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

ఇవి కూడా చదవండి: ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ట్రైలర్ విడుదల చేసిన కింగ్ నాగార్జున

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్