Saturday, January 18, 2025
Homeసినిమాఫైనల్ రౌండ్ స్టార్ట్ చేసిన ‘గని’

ఫైనల్ రౌండ్ స్టార్ట్ చేసిన ‘గని’

మెగా ప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. దీంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ.. బాక్సింగ్ చేస్తున్న వరుణ్ తేజ్ స్టిల్ తో .. పైనల్ రౌండ్ బిగిన్స్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఈ షెడ్యూల్లో వ‌రుణ్‌, ఇత‌ర ప్ర‌ధాన‌ తారాగ‌ణం పై యాక్ష‌న్ స‌న్నివేశాలు స‌హా కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించనున్నారు. ఇందు కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ భారీ స్టేడియం సెట్‌ను కూడా వేశారని సమాచారం. అలాగే హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన  హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ఆధ్వ‌ర్యంలో ఈ షెడ్యూల్‌లో యాక్ష‌న్ పార్ట్ చిత్రీక‌ర‌ణ చేయనున్నారు. ఈ షెడ్యూల్‌ పూర్తి చేసిన త‌ర్వాత రిలీజ్ డేట్‌ ఎప్పుడు అనేది క్లారిటీ వస్తుంది. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్