Friday, March 20, 2026
Homeసినిమావరుణ్ తేజ్ మ్యారేజ్ డేట్ అది కాదా..?

వరుణ్ తేజ్ మ్యారేజ్ డేట్ అది కాదా..?

వరుణ్‌ తేజ్, హీరోయిన్ లావణ్య పెద్దల సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేసుకోవడం తెలిసిందే. అయితే.. ఈ ఇయర్ లోనే వీరిద్దరి పెళ్లి అంటూ ప్రచారం జరిగింది. ఆతర్వాత ఆగష్టు 24న పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరిగింది. దీంతో 24న వరుణ్ తేజ్ మ్యారేజ్, ఆగష్టు 25న గాంఢీవధారి అర్జున రిలీజ్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు వరుణ్ తేజ్ మ్యారేజ్ ఆగష్టు 24న కాదు.. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదని.. ప్రచారంలో ఉన్న వార్త వాస్తవం కాదని టాక్ వినిపిస్తోంది.

మరి.. వరుణ్ మ్యారేజ్ ఎప్పుడు ఉంటుంది అంటే.. నవంబర్ లేదా డిసెంబర్ లో ఉంటుంది అని వరుణ్ తేజ్ సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం వీరు ఇటలీలో ఒక మంచి రిసార్ట్ బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నవంబర్ లో మూడు రోజుల పాటు మంచి రిసార్ట్ దొరికితే అప్పుడే పెళ్లి ఉంటుందని సమాచారం. ముందు పెళ్లి వెన్యూ కోసం వారి అన్వేషణ సాగుతోంది. వరుణ్ తేజ్, లావణ్య తమ ఎంగేజ్ మెంట్ కాకముందే ఇటలీలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అక్కడ వారికి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రేమించుకునే రోజుల్లోనే వారు ఇటలీకి తరుచుగా వెళ్లారట.

అందుకే.. వెన్యూ ఫిక్స్ అయితే నవంబర్ లో ఉండే మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకుంటారు. ఆగస్టులో పెళ్లి అనేది మాత్రం ఉత్తుత్తి కబురే అని సమాచారం. సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ ఆమధ్య గని అనే సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో గాంఢీవధారి అర్జున సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ సాధించి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular