Sunday, January 19, 2025
Homeసినిమాజై బాలయ్య అంటున్న చిరు డైరెక్టర్

జై బాలయ్య అంటున్న చిరు డైరెక్టర్

జై బాలయ్య అంటూ సందడి చేసిన చిరు డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా…? బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్. నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమాను తీసిన మల్లిడి వశిష్ట్ బాలయ్యకు పెద్ద ఫ్యాన్. ఈ విషయాన్ని స్వయంగా మల్లిడి వశిష్ట్ కొన్ని ఇంటర్ వ్యూలో చెప్పడం జరిగింది. కళ్యాణ్ రామ్ తో బింబిసార తర్వాత బాలయ్యతో కూడా సినిమా చేయాలి అనుకున్నాడు కానీ.. కొన్ని కారణాల వలన సెట్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా సెట్ అయ్యింది. ఈ చిత్రాన్ని యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నారు.

అయితే.. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా భారీ స్థాయిలో రిలీజైంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి స్పెషల్ షోస్ ను కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్లో వేశారు. ఈ షోకు వెళ్లిన మల్లిడి వశిష్ట్ బాలయ్యను స్ర్కీన్ పై చూసి జై బాలయ్య అంటూ థియేటర్ దద్దరిల్లేలా అరుస్తూ సందడి చేశాడట. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మల్లిడి వశిష్ట్ నెక్ట్స్ మూవీ చిరంజీవితో అని ప్రకటించారు కానీ.. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది అధికారికంగా ప్రకటించలేదు.

ప్రస్తుతం ఈ భారీ సోషియో ఫాంటసీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. చిరంజీవి సరసన నటించే హీరోయిన్స్ ఎవరు అనేది కన్ ఫర్మ్ కావాల్సివుంది. అలాగే టెక్నీషియన్స్ కూడా ఎవరు అనేది ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. చిరు సైరా నరసింహారెడ్డి మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు కానీ.. వర్కవుట్ కాలేదు. మరి.. ఈసారి పాన్ ఇండియా ప్రయత్నం ఏమౌతుందో.?

RELATED ARTICLES

Most Popular

న్యూస్