Sunday, June 14, 2026
Homeసినిమా‘వస్తున్నా వచ్చేస్తున్నా’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ చేసిన శేఖర్ కమ్ముల

‘వస్తున్నా వచ్చేస్తున్నా’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ చేసిన శేఖర్ కమ్ముల

కౌసల్య కృష్ణమూర్తి, పడేసావే, ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. అందాలభామ మిస్తి చక్రవర్తి నాయిక. తేజస్వి క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకం పై సందీప్‌ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఇ ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల విడుదల చేశారు.

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “కార్తీక్‌రాజు నటించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ఇంప్రెసివ్‌గా వుంది. చిత్రం కూడా ప్రేక్షకులు అలరించేలా వుంటుందని అనుకుంటున్నాను. ఈ చిత్రం విజయం సాధించి అందరికి మంచిపేరును తీసుకరావాలని ఆశిస్తున్నాను” అన్నారు.

దర్శక నిర్మాత సందీప్‌ గోపిశె ట్టి మాట్లాడుతూ “ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల గారితో మా ఫస్ట్‌ లుక్‌ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్‌ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఇది.  ఆడియన్స్‌ సర్‌ఫ్రైజ్‌గా ఫీలయ్యే ఎన్నోఅంశాలు ఈ చిత్రంలో వున్నాయి. పూర్తి కొత్తదనంతో, నిజాయితీగా తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular