Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్మద్య నియంత్రణలో సక్సెస్ : డిప్యుటీ సిఎం

మద్య నియంత్రణలో సక్సెస్ : డిప్యుటీ సిఎం

మద్యపాన నిషేధానికి సిఎం జగన్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల మంత్రి స్పష్టం చేశారు.  మద్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. 2020-21 సంవత్సరానికి మద్యం మీద 6,161.43 కోట్ల రూపాయల వ్యాట్ వసూలయిందని, అదే 2019-20 సంవత్సరంలో ఆదాయం 10,403.84 కోట్లు వసూలైందని వివరించారు. అంటే గతం కంటే 4,242.41 కోట్లు తక్కువగా మద్యం నుంచి వ్యాట్ వచ్చిందని, 41% ఆదాయం కోల్పోయిందన్నారు. మద్యం మీద ఆధారపడి ప్రభుత్వం నడవడం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని డిప్యుటీ సిఎం ప్రశ్నించారు. దశలవారీ మద్య నిషేధానికి చిత్తశుద్ధితో ఉన్నామని పునరుద్ఘాటించారు.

2020-21 సంవత్సరానికి జిఎస్టీ కింద 44,178.51 కోట్ల రూపాయలు వసూలయ్యయని  . 2021-22 సంవత్స రానికిగాను రెవిన్యూ వసూళ్లు 55,935.13 కోట్లుగా నిర్దేశించుకున్నామని వివరించారు.

2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ పనితీరు కనబరిచి దేశంలో4వ స్థానంలో నిలిచామని, దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో ఉన్నామని నారాయణస్వామి వివరించారు. కరోనా కారణంగా గత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం మందగించినా పేదలకు అందించే సంక్షేమ కార్యక్రమాల్లో  ఎలాంటి లోటు లేకుండా అందించారని, ప్రతి పేద కుటుంబానికి ఓ పెద్ద దిక్కుగా సంక్షేమం అమలు చేస్తున్నారని, ఇది జగన్ మోహన్ రెడ్డి పనితీరుకు నిదర్శనమని ప్రశంసించారు.

.

RELATED ARTICLES

Most Popular

న్యూస్