Friday, October 18, 2024
Homeసినిమాbharateeyans: అందరూ చూడాల్సిన చిత్రం 'భారతీయన్స్': వెంకయ్యనాయుడు

bharateeyans: అందరూ చూడాల్సిన చిత్రం ‘భారతీయన్స్’: వెంకయ్యనాయుడు

నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ హీరోలుగా… సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన సినిమా ‘భారతీయన్స్’. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకం పై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా చిత్రాల కథా రచయిత దీన్ రాజ్ ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రసాద్ లాబ్స్‌లో ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. చాలా మంచి సినిమా తీశారని చిత్ర బృందాన్ని అభినందించారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ప్రోత్సహించాలన్నారు.

”దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథ గురించి ఇటువంటి మంచి దేశభక్తి సినిమా తీయడం అభినందనీయం. దర్శక నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందిస్తున్నారు. చాలా సంతోషం. దేశభక్తి చిత్రాలను యువత, ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నాను” అని వెంకయ్య చెప్పారు.

తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ … “దేశంలోని గొప్ప నాయకులలో వెంకయ్య  ఒకరు. సమాజానికి, మన దేశానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటేనే సినిమాలను ప్రోత్సహించడానికి వస్తారు. ఆయన సినిమా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దర్శక నిర్మాతల్లో ఎంతో దేశభక్తి ఉంటేనే ఇటువంటి సినిమాలు వస్తాయి. శంకర్ గారు తన ఫ్రెండ్ దీన్ రాజ్ మీద నమ్మకం, దేశభక్తితో సినిమా తీశారు. మంచి కాన్సెప్ట్ ఇది. తప్పకుండా ప్రేక్షకులు అందరూ సినిమా చూడాలి అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్