భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సినీ హీరో చిరంజీవిలకు భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. వీరిద్దరితో పాటు వైజయంతిమాల, బిందేశ్వర్ పట్నాయక్ (మరణానంతరం), పద్మ సుబ్రహ్మణ్యంలకు కూడా ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే కన్నుమూసిన తమిళ స్టార్ కెప్టెన్ విజయ్ కాంత్, మాజీ గవర్నర్ ఫాతిమా బీవీ, మిథున్ దాదా, ఉషా ఉతుప్ పద్మభూషణ్ ఇచ్చారు.
ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. వీటిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్ జననాయక్, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
వెంకయ్య, చిరంజీవిలకు ఆంధ్ర ప్రదేశ్ కోటాలో ఈ పురస్కారం దక్కింది.
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులు పొందిన వారిలో
డి. ఉమామహేశ్వరి – ఆంధ్రప్రదేశ్
గడ్డం సమ్మయ్య – తెలంగాణ
దాసరి కొండప్ప – తెలంగాణ
కూరెళ్ల విఠలాచార్య – తెలంగాణ
సీతాపతి వేలు ఆనందాచర్య – తెలంగాణ
బంజారా కేతవాత్ సోమలాల్ – తెలంగాణ లు ఉన్నారు.