Saturday, June 13, 2026
Homeసినిమాఅనిల్ రావిపూడితో సెట్స్ పైకి వెళుతున్న వెంకటేశ్! 

అనిల్ రావిపూడితో సెట్స్ పైకి వెళుతున్న వెంకటేశ్! 

వెంకటేశ్ నుంచి ఈ సంక్రాంతికి వచ్చిన సినిమా ఆశించినస్థాయిని అందుకోలేకపోయింది. దాంతో వెంకీ అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి సంక్రాంతికి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వెంకీ ఉన్నారు. అందువల్లనే ఆయన అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి అనిల్ రావిపూడికి ఇంతవరకూ ఫ్లాప్ లేదు. అందువలన తప్పకుండా హిట్ ఖాయమనే నమ్మకంతో వెంకీ ఉన్నారు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 76వ సినిమా.

ఇంతకుముందు అనిల్ రావిపూడి – వెంకటేశ్ కాంబినేషన్లో ‘ఎఫ్ 2’ .. ‘ఎఫ్ 3’ సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలు కూడా సక్సెస్ ను సాధించాయి. ఈ కాంబినేషన్ పై కూడా మంచి క్రేజ్ ఉంది అందువలన ఇద్దరూ కూడా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఉత్సాహంతో ఉన్నారు. అనిల్ రావిపూడికి .. దిల్ రాజుకి మధ్య మొదటి నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఈ ప్రాజెక్టుకి కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వాళ్లకి తగినట్టుగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఈ కథ నడవనుంది.

ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందా అని వెంకీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దాదాపు మే నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఏ మాత్రం కాస్త అటు ఇటైనా జూన్ లో తప్పకుండా షూటింగును మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా టాక్. సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారన్న మాట. త్వరలోనే మిగతా వివరాలు కూడా తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular