Saturday, June 6, 2026
Homeసినిమా'రానా నాయుడు'పై ఆసక్తిని పెంచేసిన వెంకటేశ్!  

‘రానా నాయుడు’పై ఆసక్తిని పెంచేసిన వెంకటేశ్!  

ప్రయోగాలు చేయడంలో వెంకటేశ్ ఎప్పుడూ ముందే ఉంటారు. రీమేక్ సినిమాలు చేసే విషయంలో .. మల్టీ స్టారర్ సినిమాలు చేసే విషయంలో ఆయన తన ప్రత్యేకతను చాటుతూ వచ్చారు. తాజాగా సీనియర్ స్టార్ హీరోలలో తానే మొదటి వెబ్ సిరీస్ చేసిన క్రెడిట్ ను కొట్టేశారు. ఆ వెబ్ సిరీస్ పేరే ‘రానా నాయుడు’.  వెంకటేశ్ కి ఇది తొలి వెబ్ సిరీస్ కావడం ఒక విశేషమైతే .. రానా కాంబినేషన్లో చేయడం మరో విశేషం. ‘నెట్ ఫ్లిక్స్’ లో ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. వెంకటేశ్ – రానా ఈ వెబ్ సిరీస్ లో తండ్రీ కొడుకులుగా చేయనున్నారనే విషయం ఇంతకుముందే చెప్పారు. అలాగే ముంబై మాఫియాకి సంబంధించిన వ్యవహారాలు .. తండ్రీ కొడుకుల మధ్య  సంఘర్షణ .. ఘర్షణ ఉంటాయని చూపించారు.  ఇంతకు మించి ఈ వెబ్ సిరీస్ లో ఇంకా ఏముంటుందనే ఒక కుతూహలం కలగడం సహజం. దానికి సమాధానంగా .. ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ కూడా అక్కడక్కడా తగులుతుందనే హింట్ ను వెంకటేశ్ ఇచ్చేశారు.

“ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లలో ఎలాంటి కంటెంట్ ఉంటుందనేది అందరికీ తెలుసు. అందువల్లనే అందరూ కూడా ఎవరి గదుల్లో వారు .. ఎవరి ల్యాప్ ట్యాపులలో వారు చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో రానా నాయుడు తనకి ఎదురవుతున్న సంఘటనల వలన కొంత ఫ్రస్ట్రేషన్ కి లోనవుతాడు. ఆ సమయంలో కొన్ని సీన్స్ తెరపైకి వస్తాయి. అందువలన ఎవరి జాగ్రత్తలో వాళ్లు  ఉండాలి కదా. అలా అని చెప్పేసి మరీ భయపడాల్సిన పనేం లేదు” అంటూ ఆయన యూత్ లో ఆసక్తిని పెంచేశారు.

Also Read : 10న వస్తున్న ‘రానా నాయుడు’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular