Saturday, January 18, 2025
Homeసినిమాఅభిమానులకు క్షమాపణలు చెప్పిన వెంకటేష్‌

అభిమానులకు క్షమాపణలు చెప్పిన వెంకటేష్‌

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని ధియేటర్లో చూద్దామనుకున్న అభిమానులకు వెంకీ షాక్ ఇచ్చారు. ఈ నెల 20న నారప్ప చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అయితే.. నారప్ప చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని తెలిసిన వెంటనే వెంకీ అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోను ఓటీటీ రిలీజ్ చేయద్దన్నారు. ధియేటర్లోనే విడుదల చేయాలన్నారు. అంతే కాకుండా ఓ అభిమాని అయితే.. ఏకంగా ఒక రోజు నిరాహార దీక్ష కూడా చేశాడు.

అయినప్పటికీ నారప్ప చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 20న నారప్ప విడుదల సందర్భంగా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈ రోజు వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా వలన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. అందువలనే నారప్ప చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. నా అభిమానులు చాలా బాధపడుతున్నారని తెలుసు. అందుకే అభిమానులకు సారీ చెబుతున్నాను. వాళ్లందరూ అర్ధం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నారప్ప నా కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది’ అని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్