Saturday, July 27, 2024
Homeసినిమావెంకీ 75 వ చిత్రం ఫిక్స్

వెంకీ 75 వ చిత్రం ఫిక్స్

విక్టరీ వెంకటేష్‌ ఇటీవల కాలంలో విభిన్న కథా చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ‘నారప్ప’, ‘దృశ్యం 2’ చిత్రాల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇటీవల ‘ఎఫ్ 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించారు. ప్రస్తుతం రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వెంకీ, రానా ఇద్దరి క్యారెక్టర్లు చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ తో పాటు వెంకీ, సల్మాన్ ఖాన్ తో కలిసి కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీలో నటిస్తున్నారు. అయితే.. వెంకటేష్ నటించనున్న తదుపరి తన కెరీర్ 75వ మూవీ గురించి కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వెంకీ 75 గురించి క్లారిటీ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ తన 75వ మూవీ చేయనున్నారని తెలిసింది.

అలానే ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీని అనౌన్స్ చేయనున్నారు. వెంకీ 75వ చిత్రం అంటే అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. అయితే.. ఈ మూవీ జోనర్.. ఎంటర్ టైనరా..? యాక్షన్ మూవీనా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్