Saturday, January 18, 2025
Homeసినిమా‘జైత్ర’ టీజ‌ర్ విడుద‌ల చేసిన వెంకీ కుడుముల‌

‘జైత్ర’ టీజ‌ర్ విడుద‌ల చేసిన వెంకీ కుడుముల‌

Jaitra: ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌, ఎస్‌.కె. ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `జైత్ర‌`.  స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరో హీరోయిన్లు గా న‌టిస్తున్నారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి సురేష్ కొండేటి, అల్లం సుభాష్ నిర్మాత‌లు. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్ర  టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ ల్యాబ్‌లో బుధవారం జ‌రిగింది. చ‌లో, భీష్మ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల టీజ‌ర్‌, జైత్ర పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు.

అనంత‌రం వెంకీ కుడుముల మాట్లాడుతూ “నేను ద‌ర్శ‌కులు యోగి, త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర ప‌నిచేశాము. ఈరోజు నా ద‌గ్గ‌ర ప‌నిచేసిన మ‌ల్లి ద‌ర్శ‌కుడిగా మారి ఆయ‌న జైత్ర సినిమా టీజ‌ర్‌కు గెస్ట్‌గా రావ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. మ‌ల్లి నా ద గ్గ‌ర ఛ‌లో సినిమా చేస్తుండ‌గానే నేను చెప్పిన స‌న్నివేశాల‌ను మొహ‌మాటం లేకుండా ఎంతో నిజాయితీగా చెప్పేవాడు. దాంతో ఆయ‌న బాగా క‌నెక్ట్ అయ్యాడు. మ‌ల్లి నువ్వు ఎంత నిజాయితీగా వున్నావో ఈ సినిమా కూడా అంతే నిజాయితీ తీసివుంటావు. ఈ సంద‌ర్భంగా పేరెంట్స్‌కు ఒక‌టి చెప్ప‌ద‌లిచాను. పిల్ల‌లు ఇంజ‌నీర్‌, డాక్ట‌ర్ అవుతానంటే న‌మ్ముతారు. అలాగే ఫిలింమేక‌ర్‌, యాక్ట‌ర్ అవుతానంటే కూడా న‌మ్మండి.”

“ఇంజనీర్, డాక్ట‌ర్ కూడా నాలుగేళ్ళు క‌ష్ట‌ప‌డాలి. సినిమా మేక‌ర్ అవ్వాలంటే కూడా టైం ప‌డుతుంది. ఫిలిం మేకింగ్‌ అనేది బాధ్య‌త‌తో కూడిన జాబ్‌. ఈ చిత్ర నిర్మాత చాలా త‌ప‌న వున్న నిర్మాత‌. మంచి సినిమా తీశాడు. త‌ను క‌రాటే మాస్ట‌ర్ కాబ‌ట్టి అంద‌రూ ఒళ్ళు ద‌గ్గ‌ర‌పెట్టుకుని ప‌ని చేసుంటార‌ని చ‌మ‌త్క‌రించారు. అలాగే స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ బాగా న‌టించారు. సంగీత ద‌ర్శ‌కుడు చేసిన‌ `జోడెద్దుల` ట్యూన్ నాకు బాగా న‌చ్చింది. ఈ చిత్ర టీమ్‌కు సురేష్‌కొండేటి స‌పోర్ట్ చేయ‌డం పట్ల  ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఇక‌నుంచి జైత్ర యాత్ర సాగాల‌ని కోరుకుంటున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్