Monday, May 20, 2024
Homeసినిమాఅఖిల్ తో ప‌వ‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ మూవీ?  

అఖిల్ తో ప‌వ‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ మూవీ?  

Akhil with Venu: అక్కినేని అఖిల్ న‌టిస్తున్న‌ భారీ యాక్ష‌న్ మూవీ ఏజెంట్. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న ఈ మూవీని భారీ చిత్రాల నిర్మాత‌ అనిల్ సుంక‌ర అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే.. ఇప్పుడు అఖిల్.. ప‌వ‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ మూవీతో స‌క్సెస్ సాధించాడు అఖిల్. తొలి విజ‌యాన్ని అందుకున్న అఖిల్ రెట్టించిన ఉత్సాహంతో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. అయితే… ఈ మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే ప‌వ‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ తో మూవీకి ఓకే చెప్పాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ప‌వ‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే…ఓ మై ఫ్రెండ్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన వేణు శ్రీరామ్. ఆ సినిమా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నానితో ఎంసీఏ మూవీ చేసి స‌క్సెస్ సాధించారు.  పవర్ స్టార్ తో  వకీల్ సాబ్ డైరెక్ట్ చేసి మరో విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత  ఇప్ప‌టివ‌ర‌కు నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ప్ర‌క‌టించలేదు. తాజాగా అఖిల్ తో మూవీ ఫిక్స్ అయ్యింద‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.  ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త గురించి ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే.. అఖిల్ ఫోక‌స్ అంతా ఏజెంట్ మూవీ పైనే ఉంద‌ట‌. నెక్ట్స్ మూవీ గురించి క‌థాచ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి కానీ.. ఇంకా ఏదీ ఫైన‌ల్ కాలేద‌ని స‌మాచారం. మ‌రి.. వేణు శ్రీరామ్ కి అఖిల్ ఎస్ చెబుతాడో..?  నో చెబుతాడో..?  చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్