Wednesday, May 29, 2024
Homeసినిమాఐకాన్ స్టార్ తో అనుకుంటే నితిన్ తో సెట్ అయ్యిందా..?

ఐకాన్ స్టార్ తో అనుకుంటే నితిన్ తో సెట్ అయ్యిందా..?

అల్లు అర్జున్ తో డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఓ సినిమా చేయాలి అనుకున్నారు. అదే.. ఐకాన్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ ఐకాన్ స్టోరీ బన్నీకి బాగా నచ్చడంతో సినిమా చేస్తానని.. వెయిట్ చేయమని వేణు శ్రీరామ్ కి మాట ఇచ్చాడట. అందుకని ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అనుకున్నారు. వేణు కూడా మూవీ చేయడానికి బన్నీ ఓకే చెబుతాడేమో అనుకుని వెయిట్ చేశాడు.

పుష్ప సినిమా టైమ్ లో కథ చెప్పడం జరిగింది. అయితే.. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీ కావడం.. బాలీవుడ్ లో సంచలనం సృష్టించడంతో బన్నీ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసాడట వేణు శ్రీరామ్. బన్నీ వాసు కూడా ఐకాన్ మూవీ ఉంటుందని గతంలో చెప్పడంతో లేట్ అయినా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనుకున్నారు. అయితే… బన్నీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో దిల్ రాజు వేరే హీరోతో చేద్దామని వేణు శ్రీరామ్ కి చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా కథాచర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కి ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

బన్నీతో చేయాలి అనుకున్న ఐకాన్ ప్రాజెక్ట్ ఇప్పుడు నితిన్ తో సెట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. నితిన్ కి కథ చెబితే వెంటనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నితిన్ తో దిల్ రాజు దిల్, శ్రీనివాస కళ్యాణం సినిమాలు నిర్మించాడు. ఇందులో ‘దిల్’  సినిమా సక్సెస్ సాధించగా, ‘శ్రీనివాస కళ్యాణం’ ప్లాప్ అయ్యింది. ఈసారి నితిన్ తో హిట్ మూవీ తీయాలని దిల్ రాజు టీమ్ కథ పై బాగా కసరత్తు చేస్తున్నారని తెలిసింది. మరి.. బన్నీ నో చెప్పిన ఐకాన్, నితిన్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్