Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Rashmika with Vijay: తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న తలపతి విజయ్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఓ భారీ చిత్రాన్ని చేయ‌నున్న విష‌యం తెలిసిందే. జాతీయ అవార్డు పొందిన‌ నిర్మాత దిల్ రాజు & శిరీష్ తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో విజయ్ సరసన కథానాయికగా నటించ‌నున్న‌ట్లు ర‌ష్మిక‌ పుట్టినరోజు సందర్భంగా మేక‌ర్స్ ప్రకటించారు.

సక్సెస్ ఫుల్ కలయికలో రాబోతున్న ఈ చిత్రం అంతే సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్ద‌బోతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో విజయ్‌ని మునుపెన్నడూ చూడని స‌రికొత్త‌ పాత్రలో ప్రెజెంట్ చేయడానికి వంశీ పైడిపల్లి పవర్‌ ఫుల్ స్క్రిప్ట్‌ ను రెడీ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

Also Read : దుల్కర్ మూవీలో రష్మిక పాత్ర లుక్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com