Sunday, June 14, 2026
Homeసినిమావంశీ పైడిపల్లికి ఆ స్టార్ హీరో మళ్లీ ఛాన్స్ ఇచ్చాడా.?

వంశీ పైడిపల్లికి ఆ స్టార్ హీరో మళ్లీ ఛాన్స్ ఇచ్చాడా.?

వంశీ పైడిపల్లి ‘మున్నా’ సినిమాతో దర్శకుడు అయ్యాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సెకండ్ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు. ఆఖరికి ఎన్టీఆర్ తో ‘బృందావనం’ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ ను కొత్తగా చూపించడంతో వంశీ పైడిపల్లికి మంచి పేరు వచ్చింది. ఆతర్వాత చరణ్‌, అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘ఎవడు’ సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆతర్వాత నాగార్జున, కార్తీ కాంబినేషన్లో ‘ఊపిరి’ సినిమా చేశాడు. ఈ మూవీ తెలుగు, తమిళ్ లో సక్సెస్ అయ్యింది. ఆతర్వాత మహేష్‌ బాబుతో ‘మహర్షి’ మూవీ చేశాడు. ఈ మూవీ అవార్డులతో పాటు రివార్డులు తీసుకువచ్చింది.

ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తున్న వంశీ పైడిపల్లి ఇటీవల విజయ్ తో ‘వారసుడు’ అనే సినిమా తీశాడు. తెలుగు, తమిళ్ లో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో కొత్తదనం లేదు.. పాత కథతో రూపొందిందనే టాక్ వచ్చినప్పటికీ 300 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే.. విజయ్ మరో ఛాన్స్ వంశీ పైడిపల్లికి ఇచ్చినట్లుగా కోలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పవర్ ఫుల్ మాస్ కథాంశంతో లియో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో విజయ్ కి జోడిగా త్రిష నటించబోతుంది. దీని తర్వాత విజయ్ 68వ సినిమాని అట్లీ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత విజయ్ 69వ సినిమాని మరల వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే.. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తాడా లేదంటే కోలీవుడ్ నిర్మాతలు నిర్మిస్తారా అనేది వేచి చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ తో కూడా వంశీ పైడిపల్లి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ నేపథ్యంలో వారు కూడా విజయ్ సినిమా నిర్మించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి… విజయ్, వంశీ పైడిపల్లి, మైత్రీ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular