Wednesday, June 17, 2026
HomeసినిమాSukumar-Rowdy Star: విజయ్, సుక్కు మూవీ ఏమైంది?

Sukumar-Rowdy Star: విజయ్, సుక్కు మూవీ ఏమైంది?

విజయ్ దేవరకొండ  ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర విఫలమైనా యూత్ లో  అతనికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కథల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న విజయ్… గౌతమ్ తిన్ననూరి, పరశురామ్ లకు ఓకే చెప్పాడు, అఫిషియల్ గా అనౌన్స్  కూడా చేశారు.  వీటికంటే ముందుగా విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్లో మూవీ అంటూ  ప్రకటన వచ్చింది.

విజయ్ లైగర్ లో…సుకుమార్ పుష్పలో బిజీ అవ్వడం… ఆ వెంటనే ‘పుష్ప 2’పై దృష్టి పెట్టడంతో విజయ్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని.. అందుకనే పుష్ప 2 తర్వాత చరణ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తుంది. దీంతో విజయ్, సుక్కు ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది.

విజయ్ టీమ్ మాత్రం ఖచ్చితంగా సుకుమార్ తో మూవీ ఉంటుందని, దీనిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టంగా చెబుతున్నారు. వీరిద్దరి మధ్యా  కథా  చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. సెప్టెంబర్ 1న ఖుషి సినిమా రిలీజ్ అవుతుంది. గౌతమ్ , పరశురామ్ ల సినిమాలను సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి ఆతర్వాత సుకుమార్ తో మూవీ స్టార్ట్ చేయాలనేది విజయ్ ప్లాన్ అని తెలుస్సతోంది. మరి.. దీనిపై వారిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ  ఇవ్వాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular