Saturday, March 14, 2026
Homeసినిమావిజయ్, పరశురామ్ మూవీ ఆగిందా..?

విజయ్, పరశురామ్ మూవీ ఆగిందా..?

విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. విజయ్ బిజీగా ఉండడం వలన ఆలస్యం అయ్యింది. ఈ క్రేజీ కాంబో మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాలి అనుకున్నారు. అయితే.. ఊహించని విధంగా ఈ కాంబోలో మూవీని దిల్ రాజు అనౌన్స్ చేయడం విశేషం.

దీంతో అల్లు అరవింద్, దిల్ రాజు మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. విజయ్, పరశురామ్ మూవీని దిల్ రాజు సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలి అనుకున్నారట. అయితే.. ఈ విషయం తెలిసి గిల్డ్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కారణం ఏంటంటే.. గిల్డ్ పెద్ద అయ్యుండి డైరెక్టర్ పరశురామ్ వివాదం తేలకుండా ఎలా ప్రారంభిస్తారు.. ఇది కరెక్ట్ కాదు అన్నారట. ఈ మేరకు చర్చలు జరిగిన తర్వాత దిల్ రాజు తన సినిమా పూజా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

పరశురామ్ 14 రీల్స్ కి సినిమా చేయాలి. గీతా సంస్థలో ఓ సినిమా చేయాలి. అడ్వాన్సులు తీసుకుని సినిమా చేయకుండా ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తుండడంతో వివాదం పెద్దది అవుతుంది. అయితే.. గిల్డ్ సభ్యులు అడ్డుపడడం వలన ఈ సినిమా పూజ ఆగలేదని.. దిల్ రాజునే 14 రీల్స్ వాళ్లతో మాట్లాడినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పూజా కార్యక్రమాలు ఇప్పుడు చేయకూడదు అనుకున్నారని విజయ్ టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. మొత్తానికి పరశురామ్ అడ్వాన్స్ ఇస్తాను అంటే తీసేసుకోవడం.. ఆతర్వాత సినిమా అంతా రెడీ అయిన తర్వాత వేరే సినిమాకి వెళ్లిపోవడం కరెక్ట్ కాదనే విమర్శలు వస్తున్నాయి. మరి.. ఈ వివాదం ఎటు వైపు వెళుతుందో..? ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular