Monday, June 15, 2026
Homeసినిమా100 మందికి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు అందించిన విజయ్ దేవరకొండ

100 మందికి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు అందించిన విజయ్ దేవరకొండ

ప్రతి సంవత్సరం దేవర సాంటా గా మారి తన అభిమానులకి సంతోషాన్ని పంచే విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం 100 మందికి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు అందించాడు. తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్ కి వెళ్లిన స్మృతులని గుర్తుచేసుకుంటూ తన దగ్గర సరైన సంపాదన లేనప్పుడు ఆ ట్రిప్ కి తన స్నేహితులు తనని తీసుకెళ్లడం ఎంత సంతోషాన్నిచ్చిందో చెప్పాడు. అలాంటి సంతోషాన్ని పంచాలనే ఎంపిక చేయబడిన 100 మంది సామాన్యులని తన సొంత ఖర్చు తో మనాలి ట్రిప్ కి తీసుకెళ్లడమే కాకుండా తన తల్లితండ్రులతో పాటు వెళ్లి వారితో సమయం గడిపాడు.

తాజాగా ఆ ట్రిప్ కి సంబంధించిన గ్లింప్స్ ని విజయ్ తన హ్యాండిల్ లో పోస్ట్ చేయగా అందులో, ట్రిప్ లో భాగమైన ఆనందం, విజయ్ మీద తమ ప్రేమ, కృతజ్ఞత, తమ జీవితంలో ఈ ట్రిప్ ఎంత ముఖ్యమో తెలియజేసారు. చివర్లో అందరూ ఎమోషనల్ అయి విజయ్ ని హగ్ చేసుకోవడం ఆ 100 మంది ఒకరికొకరు ఎమోషనల్ గా దగ్గరవ్వడం చూడచ్చు. విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు. ఇందులో సమంత కథానాయిక. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular