Tuesday, March 10, 2026
Homeసినిమావిజయ్ దేవరకొండ కు కోటి మంది ఫాలోవర్స్

విజయ్ దేవరకొండ కు కోటి మంది ఫాలోవర్స్

‘రౌడీ బాయ్’గా, యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. సోషల్ మీడియా లో విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో 1 కోటీ 25 లక్షల మంది ఫాలోవర్స్ పైగా సొంతం చేసుకుని సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డు
సృష్టించిన విజయ్ ఇప్పుడు ఫేస్ బుక్ లో కూడా కోటీ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకోవటం విశేషం. విజయ్ దేవరకొండ 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ‘లైగర్’ లో నటిస్తున్నాడు. పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియా మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. స్పోర్ట్స్ నేపధ్యంతో సాగే ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగింది. ఈ మూవీ తాజా షెడ్యూల్ ను త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారని.. ఇందులో విజయ్ పై  భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారని సమాచారం. పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular