Saturday, January 18, 2025
Homeసినిమాలైగ‌ర్ సీక్వెల్ పై హింట్ ఇచ్చిన విజ‌య్

లైగ‌ర్ సీక్వెల్ పై హింట్ ఇచ్చిన విజ‌య్

సెన్సేష‌న‌ల్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా న‌టించిన చిత్రం లైగ‌ర్. ఈ చిత్రాన్ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రూపొందించారు.  టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో మూవీ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇటీవల విజయ్ దేవరకొండ మదర్ తనయుని తొలి పాన్ ఇండియా మూవీ లైగర్  చిత్రానికి విజ‌యం ద‌క్కాల‌ని ప్రత్యేక పూజను ఏర్పాటు చేసి దేవుని ఆశీర్వాదం తీసుకున్నారు. కథానాయిక అనన్య పాండే కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొని విజయ్ తల్లి నుండి ఆశీర్వాదం తీసుకుంది. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ తన సినిమాకి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు.

లైగ‌ర్ మూవీకి సీక్వెల్ ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు కానీ.. విజ‌య్ అలా హింట్ ఇవ్వ‌డంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇక ధర్మ ప్రొడక్షన్స్ అధినేత పైనా లైగర్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. పరిశ్రమని నడిపించిన వీరుడిగా కరణ్ జోహార్ పై విజయ్ ప్రశంసలు కురిపించాడు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

Also Read : లైగ‌ర్ సెన్సార్ టాక్ ఏంటి?

RELATED ARTICLES

Most Popular

న్యూస్