9.2 C
New York
Monday, December 4, 2023

Buy now

Homeసినిమాబాలీవుడ్ కి నిద్ర‌లేకుండా చేస్తున్న 'ఏజెంట్'

బాలీవుడ్ కి నిద్ర‌లేకుండా చేస్తున్న ‘ఏజెంట్’

ఒక‌ప్పుడు బాలీవుడ్ సినిమాల క‌లెక్ష‌న్స్ చూసి.. ఇంత క‌లెక్ష‌న్స్ తెలుగు సినిమాకి ఎప్పుడు వ‌స్తాయో అనుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు సినిమా విశ్వ‌వ్యాప్తం అయ్యింది. అయితే.. బాలీవుడ్ మాత్రం బాగా వెన‌క‌బ‌డింది. అక్క‌డ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిందో ఏమో కానీ.. తెలుగు సినిమాల‌కు అక్క‌డ ఆద‌ర‌ణ బాగుంది. తెలుగు నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమాల గురించి ప్రేక్ష‌కులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్ సినిమాలు వ‌రుస‌గా ప్లాప్ అవుతుండ‌డంతో అక్కడి మేక‌ర్స్ ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉన్నారు. మ‌రో వైపు తెలుగు నుంచి వ‌స్తున్న పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఇక బాలీవుడ్ ని నిద్ర లేకుండా చేస్తున్న సినిమాలు అంటే.. ఇప్పుడు లైగ‌ర్ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో అని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. లైగ‌ర్ త‌ర్వాత తెలుగు నుంచి రానున్న మూవీ ఏజెంట్.

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న ఏజెంట్ మూవీకి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట‌ర్. అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో అఖిల్ ఏజెంట్ మూవీతో ఇండియా వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం అనే టాక్ బ‌లంగా ఉంది. బాలీవుడ్ ఆడియ‌న్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్