Saturday, June 13, 2026
Homeసినిమాస్పీడ్ పెంచుతున్న 'ఫ్యామిలీ స్టార్'

స్పీడ్ పెంచుతున్న ‘ఫ్యామిలీ స్టార్’

విజయ్ దేవరకొండ అభిమానులంతా ఆయన నుంచి సాధ్యమైనంత తొందరగా ఒక హిట్ పడాలని  చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాను చేశాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. గతంలో విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన ‘గీత గోవిందం’ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అప్పటివరకూ యూత్ వరకే పరిమితమైన విజయ్ దేవరకొండ క్రేజ్ ను, ఫ్యామిలీ ఆడియన్స్ వరకూ తీసుకుని వెళ్లింది.

అందువలన అప్పటి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్టు ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. మొత్తానికి త్వరలోనే వారి ముచ్చట తీరనుంది. ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో అప్ డేట్ వాళ్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా వదిలిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. విజయ్ దేవరకొండకి .. మృణాళ్ ఠాకూర్ కి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే టీజర్ ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

దిల్ రాజు ఈ సినిమాను నిర్మిచారు. లవ్ .. రొమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలిగిన కథ ఇది. అందువలన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ‘గీత గోవిందం’ సినిమాకి సంగీతాన్ని సమకూర్చినది కూడా ఆయనే. ఆ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలవడం వలన, ఈ సినిమా పాటలను  కూడా ఆయన చేతుల్లోనే పెట్టారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular