Saturday, January 18, 2025
Homeసినిమావిజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్ ఇదే!

విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్ ఇదే!

విజయ్ దేవరకొండ అభిమానులంతా ఆయన నెక్స్ట్ మూవీ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన తాజా చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా టైటిల్ సెట్ చేయని ఈ సినిమా, చిత్రీకరణ దశలో ఉంది. శ్రీలంకలో కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఆ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకు వచ్చిన అప్ డేట్స్ చాలా తక్కువ, అందువలన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

కెరియర్ పరంగా విజయ్ దేవరకొండకి ఇది 12వ సినిమా. నిన్న ఈ సినిమా నుంచి విజయ్ దేవరకొండ పోస్టర్ ను రిలీజ్ చేశారు. గడ్డం .. షార్ట్ హెయిర్ కట్ తో కూడిన లుక్ తో ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. గాయపడిన హీరో వర్షంలో ఆక్రోశిస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. చాలా గ్యాప్ తరువాత విజయ్ దేవరకొండ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న సినిమా ఇది. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎక్కువగానే ఉంటాయనే విషయం పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది.

సితార బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇంతవరకూ 60 శాతం చిత్రీకరణ పూర్తయిందనీ, వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాత చెప్పారు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి ప్రధామైన ఆకర్షణగా నిలవనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వరుస పరాజయాలతో విజయ్ దేవరకొండ సతమతమవుతున్నాడు. ఈ సినిమాతో ఆయనకి హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.  వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్