Saturday, January 18, 2025
Homeసినిమా‘బేబి’ టీమ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది - విజయ్ దేవరకొండ

‘బేబి’ టీమ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది – విజయ్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం ‘బేబి’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబి సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలించాయి. ఈ మూవీ ఈరోజు (జూలై 14న) రిలీజ్ అయ్యింది. అయితే.. జూలై 13న వేసిన ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ ఈ ప్రీమియర్ షోను వీక్షించారు.

అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘నేను సినిమా గురించి మాట్లాడటానికి రాలేదు. ఆడియెన్స్  ఈ సినిమా మీద ఎంతగానో ప్రేమ చూపిస్తున్నారని తెలిసి వచ్చాను. ఇక్కడకు వచ్చిన అందరికీ థాంక్స్. సాయి రాజేష్‌ను చూస్తుంటే.. గర్వంగా ఉంది. ఎస్‌కేఎన్, ధీరజ్‌లను  చూస్తుంటే కూడా గర్వంగా ఉంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ ఇలా అందరూ కలిసి ఏడిపించారు.ఈ సినిమాను చూసి అందరూ ఎంజాయ్ చేయండి. సినిమా గురించి మళ్లీ తరువాత మాట్లాడుకుందాం అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. ఇదంతా మన సినిమాకే జరిగిందా? అని అనిపిస్తుంది. థియేటర్లో అరుపులు వినిపిస్తున్నాయి. ఏడుపులు వినిపిస్తున్నాయి. నన్ను నమ్మి నాకు ఈ సినిమాను ఇచ్చిన సాయి రాజేష్ అన్న, ఎస్‌కేఎన్ అన్నకి థాంక్స్. వైష్ణవి, విరాజ్‌ల సీన్లకు చూసి అరిచాను. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్