Sunday, May 19, 2024
HomeTrending NewsTDP: మహిళలు మహా శక్తి సారథులు: బాబు

TDP: మహిళలు మహా శక్తి సారథులు: బాబు

వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని మరో 9 నెలలు మాత్రమే ఉంటారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. వారు పోయిన తరువాత ఇప్పుడు తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ, ప్రతి పోలీసు అధికారినీ బోను ఎక్కిస్తానని హెచ్చరించారు. నా ప్రజలు, కార్యకర్తల కోసం వడ్డీతో సహా చెల్లిస్తానని స్పష్టం చేశారు. మహిళలను కాపాడలేని ఈ పోలీసు వ్యవస్థ దేనికి తగలబెట్టడానికా అని నిలదీశారు.  నాలుగేళ్ళలో మహిళలపై 52, 587 కేసులు నమోదయ్యాయని, 22,278 మంది మహిళలు మిస్సయ్యారని, ఇవి కేంద్రం ఇచ్చిన లెక్కల్ని వివరించారు.

గతంలో పబ్లిక్ ప్రైవేటు, పార్టనర్ షిప్ ద్వారా కొంతమంది ధనవంతులు అయ్యారని, కానీ ఇప్పుడు పిపిపి మోడెల్ లోనే పి4 తీసుకువస్తున్నామని ప్రజలు, ప్రభుతం, ప్రైవేట్ పార్టనర్ షిప్ ద్వారా ప్రతి పేదవాడినీ ధనికుడిని చేయాలనే సంకల్పం తీసుకున్నానని, దానికి సారథులు మహిళలేనని.. దానికి నాంది  మహిళా శక్తి పథకం అని వెల్లడించారు.

మహిళల కోసం తొలి విడత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ‘మహాశక్తి’ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడానికి ‘మహాశక్తి చైతన్య రథం’ పేరిట ప్రత్యేక  ప్రచార వాహనాలను రూపొందించారు. ఈ వాహనాలను ప్రారంభించిన   చంద్రబాబు అనతరం ప్రసంగించారు. రాష్ట్రంలోని మహిళలంతా మహాశక్తి సారథులు కావాలని ఆకాంక్షించారు. మహిళలకు ప్రత్యేక యూనివర్సిటీ, రాజకీయ రిజర్వేషన్స్. ఆస్తిహక్కు, డ్వాక్రా సంఘాలకు రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీయేనని బాబు గుర్తు చేశారు. మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చింది కూడా తామేనన్నారు. 1995లో తాను ముఖ్యమంత్రి అయిన తరువాత సమాజంలో వచ్చిన మార్పులను గమనించాలని కోరారు.  మహిళాశక్తి సంకల్పం తీసుకొని 41 రోజులపాటు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దసరాకు సరికొత్త ప్రణాళికతో వస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్