Tuesday, June 16, 2026
HomeసినిమాKushi OTT Streaming Date: 'ఖుషి' స్ట్రీమింగ్ డేట్ ను ఖరారు చేసిన నెట్ ఫ్లిక్స్! 

Kushi OTT Streaming Date: ‘ఖుషి’ స్ట్రీమింగ్ డేట్ ను ఖరారు చేసిన నెట్ ఫ్లిక్స్! 

విజయ్ దేవరకొండ – సమంత జంటగా ‘ఖుషి’ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఒక వైపున లవ్ … మరో వైపున ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలను తెరపై ఆవిష్కరించడంలో శివ నిర్వాణకి మంచి పేరు ఉంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఒక వైపున విజయ్ దేవరకొండ .. మరో వైపున సమంత నుంచి లవ్ స్టోరీ వచ్చి చాలా కాలం కావడంతో ఈ సినిమా పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందని మేకర్స్ భావించారు.

థియేటర్స్ కి వచ్చిన తరువాత ఈ సినిమా వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలోనే కనిపించారు. అయితే వీకెండ్ తరువాత ఈ సినిమా జోరు తగ్గుతూ వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ వారు దక్కించుకున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

శివ నిర్వాణ మంచి దర్శకుడు .. తన సినిమాలకి సంబంధించిన కథలను తానే తయారు చేసుకుంటాడు. ఆయన ట్రీట్మెంట్ చాలా నీట్ గా ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండ – సమంతను ఈ సినిమా కోసం ఎంపిక చేసినప్పుడు, ఈ జోడీ సెట్ కాలేదనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. వాళ్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాదనే కామెంట్లు సోషల్ మీడియాలోను కనిపించాయి. సినిమా విడుదల తరువాత కూడా ఇదే టాక్ కంటిన్యూ అయింది. అదే ఈ సినిమా ఆశించిన స్థాయికి వెళ్లకపోవడానికి కారణమని చెప్పుకోవచ్చు. మరి ఓటీటీ నుంచి ఈ సినిమా ఎన్నో మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular