Saturday, January 18, 2025
Homeసినిమా'ది గోట్' మూవీ స్పెషాలిటీ ఇదే: వెంకట్ ప్రభు 

‘ది గోట్’ మూవీ స్పెషాలిటీ ఇదే: వెంకట్ ప్రభు 

ఇప్పుడు విజయ్ అభిమానులందరి దృష్టి ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) పైనే ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. రీసెంటుగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి వెంకట్ ప్రభు చెప్పిన మాటలు, అభిమానుల్లో మరింతగా అంచనాలు పెంచుతున్నాయి.

‘ది గోట్’ సినిమా స్క్రీన్ ప్లే పై ఎంతో కసరత్తు చేశాము. తెరపై ఈ సినిమాను చూస్తున్న ఆడియన్స్ లో ఎవరూ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది గెస్ చేయలేరు. అంతటి అనూహ్యమైన మలుపులతో ఈ కథనం సాగుతుంది. అలా అని చెప్పి కథలో ఎక్కడా గందరగోళం ఉండదు. చాలా తేలికగా సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని నేను బలంగా చెప్పగలను” అని అన్నారు.

విజయ్ ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం ఒక విశేషం. పాతికేళ్ల కుర్రాడిగా కనిపించనుండటం మరో విశేషం. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, స్నేహ .. లైలా .. ప్రశాంత్ .. ప్రభుదేవా ముఖ్యమైన పాత్రలను పోషించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విజయ్ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలవడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్